కరోనా ఎఫెక్ట్: ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్ కు ఫుల్ గిరాకీ

కరోనా ఎఫెక్ట్: ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్ కు ఫుల్ గిరాకీ
  • ఇమ్యూనిటీ పెంచుకునే పనిలో సిటిజన్స్
  •  ఆర్గానిక్స్, డ్రై ఫ్రూట్స్, హెల్దీ ఫుడ్ కు ఫుల్ గిరాకీ
  •  లాక్ డౌన్ ముందుతో చూస్తే వ్యాపారం రెండింతలు
  •  క్యాష్యుస్, నట్స్ తో చేసిన స్నాక్స్ కి క్రేజ్

కరోనా వైరస్… సిటిజన్స్ ఫుడ్ హాబిట్స్ ను కూడా చేంజ్ చేసింది. రెగ్యులర్ మీల్స్, డైట్ తో పాటు హెల్దీ ఫుడ్ కంపల్సరీగా అవడంతో మిల్లెట్స్, సీడ్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్ కు డిమాండ్ పెరుగుతోంది. దాంతో చాలామంది ఆ బిజినెస్ వైపు మళ్లుతున్నారు.జాబ్ పోయిన వారు, బిజినెస్ లాస్ అయినవారు కాలనీల్లో కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆన్ లైన్లో ఆర్డర్లు ఇస్తే, హోం డెలివరీ కూడా చేస్తున్నారు.

పెరిగిన సేల్స్..

ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ పై సిటిజన్స్ ఫోకస్ పెట్టడంతో చాలామంది అలాంటి బిజినెస్లు మొదలుపెడుతున్నారు. కాలనీల్లోనే చిన్న స్టోర్స్ ఓపెన్ చేసి ఆర్గానిక్ ప్రొడక్స్ ట్, నట్స్, దినుసులు అమ్ముతున్నారు. కొంతమంది ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ తయారు చేస్తూ ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని హోం డెలివరీ చేస్తున్నారు. ఆర్గానిక్ వెజిటబుల్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాల సేల్స్ అమాంతం పెరిగిపోయాయి. లాక్ డౌన్కు ముందు అంతంత మాత్రంగా నడిచిన స్టోర్స్ లో ఫుల్ గిరాకీ ఉంటోంది. హెల్త్ కాన్షియస్ పెరగడంతో ధర ఎక్కువైనా కొనేందుకు జనం వెనుకాడడం లేదు. కరోనా రాకుండా ఇమ్యూనిటీ పెంచుకోవాలని డాక్టర్లు సజెస్ట్ చేస్తుండటం, పాజిటివ్ పేషేంట్స్ కు ప్రిస్కిప్ష న్లో హెల్దీ డైట్ మెన్ష న్ చేస్తుండడమూ ప్రభావం చూపుతోంది. నార్మల్ డేస్తో పోల్చితే బిజినెస్ రెండింతలు పెరిగిందని స్టోర్స్ నిర్వాహ కులు చెప్తున్నారు.

 ఆర్గానిక్ సేల్స్ ఇలా..

ఒకప్పుడు ఆర్గానిక్ ప్రొడక్స్ ట్ కొన్ని కేటగిరీల వారు మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు అందరూ కొనేస్తున్నారు. సిటీలో వందల్లో ఆర్గానిక్ స్టోర్స్ ఉండగా, ఆన్ లైన్లో ఆర్డర్లు ఇచ్చి ఇంటికే తెప్పించుకుంటున్నారు. మామూలు వెజిటబుల్స్, ఫ్రూట్స్ తో పోల్చితే ధర రెండింతలు ఉన్నా ఆలోచించడం లేదు. లాక్ డౌన్  ముందు స్టోర్ కి 10 మంది వస్తే.. ఇప్పుడు 50 మంది దాకా వస్తున్నారని, ఆన్లైన్ ఆర్డర్లు పెరిగాయని వ్యాపారులు చెప్తున్నారు.