
కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు. కాలికట్ నుంచి డుమ్మా (సౌదీ అరేబియా) వెళ్లాల్సిన విమానం హైడ్రాలిక్ వైఫల్యం రావడంతో ఆ విమానాన్ని తిరువనంతపురం విమానాశ్రయానికి మల్లించారు. 182 మంది ప్రయాణిస్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఐఎక్స్ 385 విమానం శుక్రవారం ఉదయం కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయింది. ఆ సమయంలో విమానం వెనక తోక రన్ వేను ఢీకొట్టింది. దాంతో విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. ఎయిర్‌పోర్ట్ వర్గాల సమాచారం ప్రకారం, ఫైట్ 12.15 PM కి విమానాశ్రయంలో దిగింది. దీంతో ఎయిర్ పోర్టు యాజమాన్యం విమానం ల్యాండ్ అయ్యేవరకు పూర్తి ఎమర్జెన్సీ ప్రకటించింది.