ఏయే రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలులో ఉందంటే..

ఏయే రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలులో ఉందంటే..

దేశమంతటా కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎక్కడ చూసినా కరోనా మరణాలే కనిపిస్తున్నాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాంతో పలు రాష్ట్ర్రాలు సొంతంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్ర్రాలు ఆ దిశగా ముందడుగువేశాయి. ఏయే రాష్ట్రాల్లో లాక్‌డౌన్ అమలులో ఉందో చూద్దాం.

*ఉత్తరప్రదేశ్‌లో మే10 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. మొదట అక్కడ మే 3 నుంచి మే 6 వరకు లాక్‌డౌన్ పెట్టాలనుకున్నారు. కానీ, ఆ తర్వాత దాన్ని మే8 వరకు పెంచారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను మళ్లీ మే 10 పెంచుతూ ప్రభుత్వం తాజాగా ప్రకటన చేసింది.

*ఢిల్లీలో మే 10 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. అక్కడ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏప్రిల్ 19న లాక్‌డౌన్ విధిస్తూ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కానీ, ఆ తర్వాత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగిస్తూ వచ్చారు.

*మధ్యప్రదేశ్‌లో మే 15 వరకు లాక్‌డౌన్ విధించారు. అక్కడ మే 7న లాక్‌డౌన్ విధించారు. ఇప్పటికే అక్కడ వీకెండ్ లాక్‌డౌన్ అమలు చేస్తుండటంతో మే 17 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది.

*కేరళలో మే 8నుంచి మే 16 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.

*హిమాచల్ ప్రదేశ్‌లో మే 16 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

*తమిళనాడులో మే 10 నుంచి మే 24 వరకు లాక్‌డౌన్ విధించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.

*కర్ణాటకలో మే 10 నుంచి మే 24 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.

*రాజస్థాన్‌లో మే 10 నుంచి మే 24 వరకు లాక్‌డౌన్ విధించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

*మహారాష్ట్ర్రలో మే 15 వరకు లాక్‌డౌన్ అమలులో ఉండనుంది. అక్కడ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఏప్రిల్ 29 ఆ రాష్ట్ర్ర కేబినెట్ ఈ నిర్ణయం   తీసుకుంది. 

*ఒడిషాలో కేసులు పెరుగుతుండటంతో మే 5 నుంచి మే 19 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

*బీహార్‌లో కేసుల తీవ్రత దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం మే 4 నుంచి మే 15 లాక్‌డౌన్ విధించింది.

*జార్ఖండ్‌లో కరోనా కేసులను తగ్గించడం కోసం అక్కడ ఏప్రిల్ 22 నుంచి మే 6 లాక్‌డౌన్ విధించారు. కానీ కేసుల తీవ్రత దృష్ట్యా మళ్లీ మే 13 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.