ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఈ నెల 4న సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను సోమవారం కలెక్టర్రాజర్షి షా, ఎస్పీ అఖిల్మహాజన్పరిశీలించారు. ఎరోడ్రామ్గ్రౌండ్లో హెలీప్యాడ్స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అడిషనల్కలెక్టర్లుశ్యామలాదేవి, రాజేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.
