ఈ పెళ్లి బారాత్‌కు డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతో కాపలా

ఈ పెళ్లి బారాత్‌కు డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతో కాపలా

పెళ్లి బరాత్ అంటే.. బంధువుల హడావుడి.. స్నేహితుల తీన్మార్ స్టెప్పులు, ఆప్యాయతలు, పలకరింపులుంటాయి. కానీ.. ఇప్పుడు మీరు చూస్తున్న పెళ్లి బరాత్ మాత్రం డిఫరెంట్. ఈ పెళ్లి బరాత్ లో బంధువులు, స్నేహితులు కంటే.. పోలీసులే ఎక్కువున్నారు. ఒక సాధారణ వ్యక్తి పెళ్లికి.. వీ వీఐపీకి ఇచ్చే సెక్యూరిటీ కల్పించారు. ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, ఏడుగురు ఎస్ఐలు, వందమంది పోలీసులు, ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీంతో బందోబస్తు కల్పించారు.

పోలీసు పహారా మధ్య.. కర్నూలు జిల్లా వెళ్దుర్తి మండలం నర్సాపూర్ లో పెళ్లి ఊరేగింపు జరిగింది. గ్రామానికి చెందిన చెన్నకేశన్నకు.. కోడుమూరు మండలం గోరంట్లకు చెందిన లలితతో వివాహం జరిగింది. అయితే.. గ్రామంలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. రెండు వర్గాలను డీఎస్పీ పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో.. తమ పెళ్లి ఊరేగింపునకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరడంతో.. బందోబస్తు కల్పించారు. భారీ సెక్యూరిటీ మధ్య పెళ్లి బరాత్ జరగడం.. అందరినీ ఆశ్చర్య పరిచింది.