పూర్తిస్థాయిలో వాట్సాప్  పేమెంట్​ సర్వీసులు

పూర్తిస్థాయిలో వాట్సాప్  పేమెంట్​ సర్వీసులు

న్యూఢిల్లీ: మనదేశంలో వాట్సాప్ పేమెంట్స్ సర్వీసులు యూజర్లందరికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.   ఈ యూపీఐ ఆధారిత సేవలు గత నవంబరులోనే మొదలయ్యాయి. ఈ ఏడాది జూన్ నుంచి మరింత మంది యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు  యూజర్లందరూ మొబైల్ యాప్‌‌‌‌ ద్వారా ఉపయోగించుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్‌‌‌‌లో దూసుకెళ్తున్న గూగుల్, ఫోన్‌‌‌‌పే, పేటీఎంలకు వాట్సాప్ యూపీఐ సేవలు గట్టి పోటీని ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాట్సాప్‌‌‌‌ యూపీఐ సేవలను యాప్‌‌‌‌లో ఈజీగా యాక్టివేట్‌‌‌‌ చేసుకోవచ్చు.   యాప్  కుడి భాగంలో పైన ఉండే 3 చుక్కలపై  క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపించే ఆప్షన్‌‌‌‌ల లిస్ట్‌‌‌‌లో వాట్సాప్ పేమెంట్ సర్వీస్‌‌‌‌ కనిపిస్తుంది. 
వాట్సాప్ పేమెంట్ సర్వీస్ ఫీచర్లు
  వాట్సాప్ ఇండియా పేమెంట్స్ ప్రైవసీ పాలసీ విధానం ప్రకారం యూపీఐ సేవలు అందిస్తామని కంపెనీ తెలిపింది.   యూపీఐ లావాదేవీల డేటాను ఎన్క్రిప్ట్ చేస్తారు. డేటాను మనదేశంలోని సర్వర్లలోనే సేవ్ చేస్తారు.   యూపీఐ పిన్‌‌‌‌,   ఓటీపీ ,  ఖాతా నంబర్, డెబిట్ కార్డ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని సేవ్​ చేయరు. 
డబ్బు పంపడం ఇలా...
యూజర్లు  తమ ఖాతా వివరాలను వెరిఫై చేయాలి. వెరిఫికేషన్‌‌‌‌ పూర్తయ్యాక  నచ్చిన నంబరును యూపీఐ పిన్ గా పెట్టుకోవాలి.  ‘సెటప్ యూపీఐ పిన్’ అనే ఆప్షన్‌‌‌‌ తరువాత ‘డన్​’ బటన్​ నొక్కితే పనిపూర్తయినట్టే! ఇప్పుడు డబ్బు పంపాల్సిన నంబరుపై క్లిక్‌‌‌‌ చేయాలి. ఎదుటి వారికి కూడా వాట్సప్‌‌‌‌ ఖాతా ఉంటేనే డబ్బు పంపడం వీలవుతుంది. 
వాట్సాప్ యూపీఐ సర్వీసును యాక్టివేట్ చేయడం ఎలా?
మీ ఫోన్‌‌‌‌లో వాట్సాప్ యూపీఐ సర్వీసును యాక్టివేట్ చేయడానికి యాప్​ కుడివైపున కనిపించే  ‘త్రీ డాట్స్‌‌‌‌’పై క్లిక్ చేసి  పేమెంట్స్ ఆప్షన్‌‌‌‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు ‘యాడ్‌‌‌‌ పేమెంట్‌‌‌‌ మెథడ్‌‌‌‌’ను సెలెక్ట్‌‌‌‌ చేసుకోవాలి. వెంటనే యూపీఐకి సపోర్ట్ చేసే ఇండియన్ బ్యాంకుల లిస్టు వస్తోంది. యూజర్లు తమ యాక్టివ్ అకౌంట్ వివరాలను వెరిఫై చేయాలి. ఖాతాకు లింక్ చేయడానికి వాట్సాప్ మొబైల్ నంబర్‌‌‌‌నే వాడాలి. తమ బ్యాంక్ ఖాతాలను వాట్సాప్‌‌‌‌కి యాడ్ తర్వాత డబ్బును పంపవచ్చు లేదా తీసుకోవచ్చు. యూజర్లు పేమెంట్స్ రూల్స్, ప్రైవసీ పాలసీని అంగీకరించాలి. ఎస్ఎంఎస్ వెరిఫికేషన్‌‌‌‌ను కూడా ఓకే చేయాలి. వాట్సాప్ యూపీఐ సపోర్ట్ ఉన్న బ్యాంకుల అకౌంట్ల నుంచి మాత్రమే లావాదేవీలు చేయడానికి వీలుంటుంది. అయితే వాట్సాప్ కు ఖాతా లింక్ కాకున్నా డబ్బును తీసుకోవచ్చు. ఇందుకోసం  ‘రిసీస్ మనీ’ ఆప్షన్‌‌‌‌ ఉపయోగించాలి.