
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ జనరలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ (ఎఫ్జీఐఎల్ఐ) 2024-–25 ఆర్థిక సంవత్సరానికి తన వ్యాపార, ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.609 కోట్లుగా ఉన్న కంపెనీ మొత్తం వ్యాపార ప్రీమియం, 2025 ఆర్థిక సంవత్సరంలో 96శాతం పెరిగి, రూ.1,192 కోట్లకు చేరుకుంది. వ్యక్తిగత కొత్త వ్యాపార ప్రీమియం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.398 కోట్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 19శాతం వృద్ధితో రూ.476 కోట్లకు చేరుకుంది. గ్రూప్ కొత్త వ్యాపార ప్రీమియం 2025 ఆర్థిక సంవత్సరం లో 240శాతం పెరిగి ంది.