ఇవ్వాల నుంచి ఓటు హక్కుపై ఫొటో ఎగ్జిబిషన్ : జి.కోటేశ్వర్ రావు

ఇవ్వాల నుంచి ఓటు హక్కుపై ఫొటో ఎగ్జిబిషన్ : జి.కోటేశ్వర్ రావు

నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ , సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్యర్యంలో ఓటు హక్కు పై ఈ నెల 25 నుంచి 27 వరకు ఫొటో ఎగ్జిబిషన్​   ఏర్పాటు చేస్తున్నట్టు  జిల్లా క్షేత్ర ప్రచార అధికారి జి.కోటేశ్వర్ రావు తెలిపారు. 

నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసే  ఈ ప్రదర్శనను   కలెక్టర్ హరిచందన దాసరి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ, స్వీప్​ జిల్లా నోడల్ అధికారి ప్రేమకరణ్ రెడ్డి, ఇతర జిల్లా నోడల్ అధికారులు పాల్గొంటారని తెలిపారు.