
హైదరాబాద్, వెలుగు : హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇన్చార్జ్ అడిషనల్ కమిషనర్‌గా డీహెచ్ గడల శ్రీనివాస రావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఇచ్చిన ఉత్తర్వులు, బుధవారం బయటకొచ్చా యి.
హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌గా ఉన్న శ్వేతా మహంతి, సెంట్రల్ సర్వీస్‌కు వెళ్లడంతో మూడు నెలలుగా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్చార్జ్ కమిషనర్‌గా హెల్త్ సెక్రటరీ రిజ్వీ కొనసాగుతుండగా, అడిషనల్ కమిషనర్‌గా డీహెచ్‌కు బాధ్యతలు అప్పగించారు.