వికారాబాద్ మున్సి పల్ చైర్ పర్సన్ గా గడ్డం అనన్య

వికారాబాద్ మున్సి పల్ చైర్ పర్సన్ గా గడ్డం అనన్య

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా అసెంబ్లీ స్పీకర్ ​గడ్డం ప్రసాద్ కుమార్ ​కూతురు గడ్డం అనన్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్ పర్సన్ స్థానానికి ఆమె ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. గడ్డం అనన్య వికారాబాద్​లోని 17వ వార్డు నుంచి కాంగ్రెస్ కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచారు. 

వైస్ చైర్మన్​గా 10వ వార్డుకు చెందిన అర్థ సుధాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. అనంతరం వీరిద్దరితో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో హాజరై, నూతన చైర్‌‌ పర్సన్, వైస్ చైర్మన్‌‌లకు శుభాకాంక్షలు తెలిపారు.