బస్సు ప్రమాద మృతురాలి కుటుంబానికి రూ.7 లక్షల చెక్కు అందజేత

బస్సు ప్రమాద మృతురాలి కుటుంబానికి రూ.7 లక్షల చెక్కు అందజేత
  • తారాబాయి కుటుంబానికి  అందించిన స్పీకర్​ ప్రసాద్​కుమార్

వికారాబాద్​, వెలుగు: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం తాండాకు చెందిన తారాబాయి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.7 లక్షల చెక్కును అందజేశారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ ఈ చెక్కు అందించడంతో పాటు తన సొంతంగా రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్​ కలెక్టర్​ సుధీర్​, ఆర్డీవో వాసుచంద్ర, డీసీసీబీ డైరెక్టర్​ కిషన్​నాయక్​ పాల్గొన్నారు.

పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి

పత్తి రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం వికారాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా మాత్రమే ఉంటుందన్నారు. 

గతేడాది ఎకరాకు 11 క్వింటాల వరకు పత్తిని కొనుగోలు చేశారని, ఈసారి 7 క్వింటాళ్లకు తగ్గించారని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల పత్తి పండించే రైతులకు నష్టం జరుగుతుందని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.