వంశీకి బెల్లంపల్లిలో 50 వేలకు పైగా మెజారిటీ రావాలె: గడ్డం వినోద్

వంశీకి బెల్లంపల్లిలో 50 వేలకు పైగా మెజారిటీ రావాలె: గడ్డం వినోద్

బెల్లంపల్లి: ఎంపీ ఎన్నికల తర్వాత బెల్లంపల్లిలోని సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారందరికీ ఇండ్ల పట్టాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అన్నారు. ఇవాళ ఇవాళపెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించారు.  ఈ సమావేశంలో పాల్గొన్న వినోద్ మాట్లాడుతూ  కాకా స్ఫూర్తితో ముందుకు వచ్చిన వంశీకృష్ణను ఆశీర్వదించి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. 

పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు బెల్లంపల్లి నియోజకవర్గంలో 50 వేలకు పైగా మెజారిటీ రావాలన్నారు. వంశీని గెలిపిస్తే అందుకు కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను గుర్తించి స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చారు. కాకా వెంకటస్వామి కుటుంబానికి పెద్దపల్లి నియోజకవర్గంతో 60 ఏళ్ల అనుబంధం ఉందని ఆయన వెల్లడించారు.