మహదేవపూర్, వెలుగు: మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరంలో గురువారం చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం రాజారం మాజీ సర్పంచ్ తాటి రాజాగౌడ్ కుమారుడు వెంకటేశ్ తో కాళేశ్వరం గ్రామానికి చెందిన పాలకుర్తి స్వరూపా ప్రభాకర్ కుమార్తె సుస్మిత మ్యారేజీ జరిగింది.
ఎమ్మెల్యే వివేక్ ఈ మ్యారేజీకి హాజరై న్యూ కపుల్స్ ను ఆశీర్వదించారు. ఆయనవెంట చెన్నూర్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హేమంత్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మెంగాని అశోక్, ఎంపీటీసీ రేవెల్లి మమత నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.