V6 News

తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన గద్దర్ పాట

తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చిన గద్దర్ పాట

తెలంగాణ పోరాటానికి గద్దర్ పాట ఊపునిచ్చింది.‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా.. పోరు తెలంగాణమా.. కోట్లాది గానమా’ అంటూ ఆయన పాడిన పాట రాష్ట్రమంతటా మార్మోగింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా జరిగిన ప్రతి ఆందోళనలో ఈ పాట ఉర్రూతలూగించింది. ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ అంటూ తెలంగాణ వెనకబాటుతనాన్ని గద్దర్ గానం చేశారు. తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన ధూంధాంలో కళాకారులకు పెద్దన్నగా తోడై నిలిచారు. గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఏ సభకు వెళ్లినా గోసీ, గొంగడి వేసుకుని కాళ్లకు గజ్జె కట్టి, చేతిలో కర్ర పట్టుకుని కనిపించేవారు.  

వలస కూలీలకు ఇండ్ల పట్టాలు
పాలమూరు జిల్లా నుంచి పొట్టచేతబట్టుకుని వలస వచ్చిన కార్మికులకు హైదరాబాద్‌‌ మహానగరంలో నిలువ నీడలేని స్థితిలో ఉండగా.. గద్దర్ వారందరినీ ఒక్కటి చేశారు. 400 మందికి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేయించారు. సర్కార్ నుంచి పట్టాలు ఇప్పించి, ఇండ్లు మంజూరు చే యించారు. వివిధ ఫంక్షన్లకు నిరుపేదల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మించారు. 2016 –-17లో కొన్ని సొంత డబ్బు లు, మరికొంత ప్రభుత్వ సహకారంతో సు మారు రూ.20 లక్షల వ్యయంతో 800  మంది కూర్చునేలా కమ్యూనిటీ హాల్‌‌ నిర్మించారు.