‘గాడియం’ 24 గంటల రన్‌‌‌‌ షురూ

‘గాడియం’ 24 గంటల రన్‌‌‌‌ షురూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్విరామంగా 24 గంటల పాటు జరిగే  ‘గాడియం హైదరాబాద్ స్టేడియం రన్ 2022’ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఈ రన్‌‌‌‌ నిర్వహిస్తారు. గాడియం స్పోర్టోపియాలోని అథ్లెటిక్ ట్రాక్‌‌‌‌పై ఈ పోటీ జరుగుతోంది.  గతేడాది 12 గంటల రన్‌‌‌‌ నిర్వహించగా ఈసారి 24 గంటల రన్‌‌‌‌గా అప్‌‌‌‌గ్రేడ్ చేశారు.  

ఈ ఈవెంట్‌‌‌‌లో 24 గంటల సోలో అల్ట్రా రన్, 12 గంటల సోలో అల్ట్రా రన్, 12 గంటల టీమ్ రిలే రన్‌‌‌‌లు ఉన్నాయి. జంట నగరాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి 500 మంది రన్నర్లు పాల్గొంటున్నారు. ఆరుగురితో కూడిన   సుమారు 85 జట్లు బరిలో నిలిచాయి. ఒక్కో జట్టు కనీసం 2 గంటల పాటు రిలే సీక్వెన్స్ లాగా​ రన్నింగ్‌‌లో పాల్గొంటుంది. విజేతలకు మొత్తం రూ.2,64,000 ప్రైజ్‌‌‌‌ మనీ అందిస్తారు.