ఆటోమొబైల్​ డీలర్లూ స్క్రాపింగ్​ ఫెసిలిటీస్​ పెట్టాలి:నితిన్ గడ్కరీ

ఆటోమొబైల్​ డీలర్లూ స్క్రాపింగ్​ ఫెసిలిటీస్​ పెట్టాలి:నితిన్ గడ్కరీ

న్యూఢిల్లీ :  స్క్రాపింగ్​ ఫెసిలిటీలను ఏర్పాటు చేయడంలో ఆటోమొబైల్​ డీలర్లు కూడా చొరవ తీసుకోవాలని రోడ్​ట్రాన్స్​పోర్ట్​ అండ్​ హైవేస్​ మినిస్టర్​ నితిన్​ గడ్కరీ పిలుపు ఇచ్చారు. వెహికల్​ స్క్రాపింగ్​ ఫెసిలిటీల ఏర్పాటుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని చెబుతూ, సర్క్యులర్​ఎకానమీని ఎంకరేజ్​ చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.  ఆటో రిటైల్​ కాంక్లేవ్​లో గురువారం నితిన్​ గడ్కరీ మాట్లాడారు. ఇండియాను అతి పెద్ద గ్రీన్​హైడ్రోజన్​ మాన్యుఫాక్చరర్​గా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు.

బయోఫ్యూయెల్​ వంటి ఆల్టర్నేటివ్​ ఫ్యూయెల్స్​ను వీలైనంతగా ప్రమోట్​ చేస్తున్నామని అన్నారు. దేశం అయిదు ట్రిలియన్​ డాలర్ల ఎకానమీగా మారడంలో ఆటోమొబైల్​ డీలర్లు ముఖ్యపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఇండియా ప్యాసింజర్​ వెహికల్స్​ తయారీలో గ్లోబల్​గా నాలుగో ప్లేస్​లోనూ, కమర్షియల్​ వెహికల్స్​ తయారీలో ఆరో ప్లేస్​లోనూ నిలుస్తోంని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆటోమొబైల్​ మాన్యుఫాక్చరింగ్​ హబ్​గా మారాలనేదే తన కలగా పేర్కొన్నారు. నేషనల్​ వెహికల్​ స్క్రాపేజ్​ పాలసీని ఆగస్టు 2021 లో  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంఛ్​ చేశారని చెబుతూ, అన్​ఫిట్​,  పొల్యూటింగ్​ వెహికల్స్​ తగ్గించడానికి ఈ పాలసీ వీలు కల్పిస్తుందని మంత్రి వెల్లడించారు.