గెయిల్​ లాభం 78 శాతం డౌన్

గెయిల్​ లాభం 78 శాతం డౌన్

న్యూఢిల్లీ: గ్యాస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​ (గెయిల్​) నికర లాభం తాజా మార్చి క్వార్టర్లో 77.5 శాతం తగ్గిపోయింది. పెట్రో కెమికల్స్​ సెగ్మెంట్​ వల్లే ప్రధానంగా లాభం తగ్గిపోయినట్లు గెయిల్ ప్రకటించింది. మార్చి 2023 క్వార్టర్​కు గెయిల్​ రూ. 603.52 కోట్ల నికర లాభం సంపాదించింది.

అంతకు ముందు ఏడాది క్యూ 4 లో కంపెనీ నికర లాభం రూ. 2,683.11 కోట్లు. మార్చి 2023 తో ముగిసిన నాలుగో క్వార్టర్లో గెయిల్​ ఆదాయం కూడా తగ్గి రూ. 32,858 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్​గా చూస్తే గెయిల్​ రెవెన్యూ రూ. 1,45,875 కోట్లకు చేరగా, కన్సాలిడేటెడ్​ నెట్​ ప్రాఫిట్​ మాత్రం రూ. 5,616 కోట్లకు పడిపోయింది.