రాష్ట్రపతి భవన్‌కు గాజులపేట విద్యార్థులు

రాష్ట్రపతి భవన్‌కు గాజులపేట విద్యార్థులు

న్యూఢిల్లీ, వెలుగు: నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం విద్యతోపాటు కృషి, అంకింతభావం ఎంతో అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్టడీ టూర్‌లో భాగంగా తెలంగాణలోని పీఎం శ్రీ జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల(జడ్‌పీహెచ్‌ఎస్‌) గాజులపేట విద్యార్థులు సోమవారం రాష్ట్రపతి భవన్‌ను సందర్శించారు. 

వారికి రాష్ట్రపతి భవన్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాష్ట్రపతి ముర్ము మాట్లాడారు. లక్ష్యాలను సాధించడంలో విద్య, కృషి, అంకితభావం అవసరమని దిశానిర్దేశం చేశారు. అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కావాల్సిన సూచనలు చేశారు. 

అనంతరం విద్యార్థులతో కలిసి రాష్ట్రపతి ఫొటో దిగారు. రాష్ట్రపతి భవన్‌ సందర్శనపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. తమ కల నిజం చేసిన పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.