గజ్వేల్, వెలుగు: ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కేసీఆర్ సొంత ఆస్తి కాదని, రూల్స్ ప్రకారం.. అక్కడ సీఎం చిత్రపటాన్ని ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట ఆంక్షారెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ చిత్రపటానికి ఎలాంటి నష్టం చేయకుండా, గాంధేయ మార్గంలోనే తాము సీఎం ఫొటోను బిగించామని తెలిపారు. ఏడేళ్లుగా కేసీఆర్ ఈ క్యాంప్ ఆఫీసుకు వచ్చిన దాఖలాలు లేవని, ఇప్పటికైనా ఆయన ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు.
అనంతరం సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసి, ఆయన ఫొటోను తొలగించిన వంటేరు ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె కాంగ్రెస్ నాయకులతో కలిసి గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, కనకయ్య గౌడ్, పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, నాయకులు పాల్గొన్నారు.
