‘గెలాక్సీ ఎం14’ పేరుతో 5జీ ఫోన్​ లాంచ్​

‘గెలాక్సీ ఎం14’ పేరుతో  5జీ ఫోన్​ లాంచ్​

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్​  బ్రాండ్​ శామ్​సంగ్​ ‘గెలాక్సీ ఎం14’ పేరుతో ఇండియా మార్కెట్లో 5జీ ఫోన్​ను లాంచ్​ చేసింది.    ఇందులో 6.6 ఇంచుల స్క్రీన్​, ఈక్సినాస్​1330 ఆక్టా-కోర్ ప్రాసెసర్​, ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 13-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,  6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 25వాట్స్​ ఛార్జింగ్‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 13,490 కాగా,  6జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 14,990. ఈ స్మార్ట్‌‌‌‌ఫోన్ బ్లూ, డార్క్ బ్లూ  సిల్వర్ కలర్ వేరియంట్‌‌‌‌లలో లభ్యమవుతుంది. ఈ నెల 21 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.