హీరో బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టడు

హీరో బోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టడు

మహేష్ మేనల్లుడు, ఏపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు అశోక్ హీరోగా పరిచయమవుతున్న ‘హీరో’ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా జరిగిన  ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి దర్శకుడు రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘మైక్రో సాఫ్ట్, యాపిల్ కంపెనీ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ బయటికొస్తే ఎంత గొప్పగా ఉంటాయో.. గ్రేట్ యాక్టర్ కృష్ణ, పొలిటీషియన్ జయదేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ఫ్యామిలీ నుంచి వస్తున్న అశోక్ కూడా అలాగే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతాడు’ అన్నారు. వీడియో బైట్ ద్వారా కృష్ణ మాట్లాడుతూ ‘ఈ సినిమా నేను చూశాను. అశోక్ కొత్తవాడనిపించడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. అశోక్ చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నా సినిమాలో నటించాడు కూడా. ఇప్పుడు తనని కౌబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూస్తుంటే నన్ను నేను చూసు కుంటున్నట్టు అనిపించింది. తనను హీరోగా నిలబెట్టాలని నా అభిమానుల్ని, మహేష్ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కోరుతున్నాను’ అన్నారు.  సుధీర్ బాబు, రానా, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, రాధాకృష్ణ కుమార్, శివ నిర్వాణ, నిర్మాత అనిల్ సుంకర కూడా హాజరై అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి విషెస్ చెప్పారు. అశోక్ మాట్లాడుతూ ‘యాక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఇష్టంతోనే ‘హీరో’గా వస్తున్నాను. అందరూ బ్లెస్ చేస్తారనుకుంటున్నా’ అన్నాడు. తనకు చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది నిధి అగర్వాల్.  చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ ‘మంచి టీమ్ కుదిరింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో సాలిడ్ హీరో దొరికాడు. ప్రేక్షకులు సంక్రాంతిని సూపర్బ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెలెబ్రేట్ చేసుకుంటారు’ అని చెప్పాడు.  నిర్మాత పద్మావతి గల్లా, గల్లా జయదేవ్, డీవోపీ సమీర్ రెడ్డి, నటులు నరేష్, అర్చన తదితరులు పాల్గొన్నారు.