ఇంటర్నేషనల్​మార్కెట్​కు గల్లాబాక్స్

ఇంటర్నేషనల్​మార్కెట్​కు గల్లాబాక్స్

హైదరాబాద్​, వెలుగు: చిన్న, మధ్యతరహా వ్యాపారాలు (ఎస్ఎంబీలు) వాట్సాప్ ద్వారా తమ అమ్మకాలను పెంచుకోవడానికి సహాయపడే కామ‌‌‌‌‌‌‌‌ర్స్  ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాం గల్లాబాక్స్ భారతదేశంతో పాటు ప్రపంచ మార్కెట్లలోకి విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. 2023 మార్చి నాటికి పెయిడ్ కస్టమర్ల సంఖ్య రెట్టింపు కావడంతో కంపెనీ కొద్ది నెలల్లోనే  ఎన్నో విజయాలను సాధించింది. ట్రావెల్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ప్రొడక్ట్ కామర్స్, రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాల్లో 1,000 కు పైగా సంస్థలు గల్లాబాక్స్ ను ఉపయోగిస్తున్నాయి.

సంస్థ కస్టమర్లలో పిక్ యువ‌‌‌‌‌‌‌‌ర్ ట్రయ‌‌‌‌‌‌‌‌ల్‌‌‌‌‌‌‌‌, గో ఇర్లాండ్, వకీల్ సెర్చ్, జుపే, కావేరీ మెడ్స్, నెక్స్ట్ వేవ్, షిప్‌‌‌‌‌‌‌‌రాకెట్, ఇల్యూషన్ ఎలైన‌‌‌‌‌‌‌‌ర్స్ వంటి సంస్థలు ఉన్నాయి.  ప్రస్తుతం ముంబై, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ 2023 చివరి నాటికి టైర్​–2 నగరాలకు విస్తరించాలని యోచిస్తోంది. గల్లాబాక్స్ కు భారతదేశంతో పాటు 20కి పైగా దేశాలకు చెందిన కస్టమర్లు ఉన్నారు. వచ్చే 6 నెలల్లో బ్రెజిల్, మిడిల్ ఈస్ట్, ఏపీఏసీలకు విస్తరించడంపై దృష్టి సారించింది. వ్యాపారులు తమ కస్టమర్లతో వాట్సాప్ ద్వారా తక్షణమే కమ్యూనికేట్​ చేయడానికి, సాయం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.