RCB vs KKR: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. కోహ్లీ, గంభీర్ ఒకటయ్యారు

RCB vs KKR: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్.. కోహ్లీ, గంభీర్ ఒకటయ్యారు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ లకు అసలు పడని సంగతి తెలిసిందే. గత 10 ఏళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడం.. ఒకరి మీద మరొకరు బహిరంగంగా విమర్శించుకోవడం జరుగుతూనే ఉన్నాయి. అయితే వీరిద్దరూ క్రికెట్ ప్రేమికులకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇద్దరూ ఒకటై అభిమానులను అందరిని దిల్ ఖుష్ చేశారు.

చిన్నస్వామి స్టేడియంలో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ డ్రింక్స్ విరామంలో కోహ్లీ, గంభీర్ ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒకరినొకరు చేతులు మీద వేసుకొని నవ్వుతూ కనిపించారు. ఏదో మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా కనిపించారు. ఈ మూమెంట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా మారింది.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవరల్లో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. చివరి వరకు క్రీజ్ లో ఉన్న కోహ్లీ 58 బంతుల్లో 80 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా, రస్సెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సునీల్ నరైన్ కు ఒక వికెట్ దక్కింది.