IND vs PAK: ఇది కరెక్ట్ కాదు.. షేక్ హ్యాండ్ ఇవ్వండి: టీమిండియా ప్లేయర్స్‌ను గ్రౌండ్‌లోకి తీసుకొచ్చిన గంభీర్

IND vs PAK: ఇది కరెక్ట్ కాదు.. షేక్ హ్యాండ్ ఇవ్వండి: టీమిండియా ప్లేయర్స్‌ను గ్రౌండ్‌లోకి తీసుకొచ్చిన గంభీర్

ఆసియా కప్ లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య లీగ్ దశలో జరిగిన మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇండియా ప్లేయర్స్ ఎవరూ కూడా పాకిస్థాన్ క్రికెటర్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడంతో పాక్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తికి గురైంది. మ్యాచ్ రిఫరీ మీద పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసినా ఐసీసీ పట్టించుకోలేదు. దీంతో ఏదో చేద్దామని ఓవరాక్షన్ చేసిన పాకిస్థాన్ కు చివరకు నిరాశే మిగిలింది. ఇండియా, పాకిస్థాన్ జట్లు సూపర్-4కు చేరడంతో ఇరు జట్ల మధ్య ఆదివారం (సెప్టెంబర్ 21) మ్యాచ్ జరిగింది. 

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సేమ్ సీన్ రిపీటైంది. టాస్ టైంలో.. మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్స్ కు టీమిండియా ప్లేయర్స్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. తిలక్ వర్మ  విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత హార్దిక్ పాండ్యతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. అయితే పాకిస్థాన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తమ హుందాతనాన్ని చాటుకున్న టీమిండియా.. అంపైర్లతో పాటు మ్యాచ్ అధికారులకు షేక్ ఇవ్వకవడం మర్చిపోయారు. ఇది గమనించిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇండియా ప్లేయర్స్ ను డ్రెస్సింగ్ రూమ్ లో నుంచి పిలిచి అంపైర్లకు.. మ్యాచ్ అధికారులకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని సూచించాడు. 

జట్టు మొత్తం ఆ తర్వాత గ్రౌండ్ లోకి వచ్చి అంపైర్ల షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (సెప్టెంబర్ 22) జరిగిన సూపర్‌‌‌‌–4 మ్యాచ్‌‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. టాస్ ఓడిన పాక్ తొలుత 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. ఓపెనర్ సాహిబ్జదా ఫర్హాన్ (45 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) ఫిఫ్టీతో సత్తా చాటగా..  సైమ్ ఆయుబ్ (21), మహ్మద్ నవాజ్ (21), ఫహీమ్ అష్రఫ్ (20 నాటౌట్‌‌) రాణించారు. ఇండియా బౌలర్లలో శివం దూబే  (2/33) రెండు వికెట్లతో మెప్పించగా..  హార్దిక్ పాండ్యా (1/29), కుల్దీప్ యాదవ్  (1/31) చెరో వికెట్ పడగొట్టారు. 

ALSO READ : సౌతాఫ్రికా క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే..

 అనంతరం  ఇండియా 18.5  ఓవర్లలో 174/4  స్కోరు చేసి ఈజీగా గెలిచింది.అభిషేక్ శర్మ (39 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 74) విధ్వంసకర బ్యాటింగ్‌‌తో షేక్ చేసేశాడు. అతనికి తోడు శుభ్‌‌మన్ గిల్ (28 బాల్స్‌‌లో 8 ఫోర్లతో 47) కూడా తిలక్ వర్మ (19 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 నాటౌట్‌‌) కూడా రాణించాడు. అభిషేక్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌‌లో బంగ్లాదేశ్‌‌తో ఇండియా  తలపడనుంది.