Game Changer Jaragandi: జరగండి..జరగండి..గేమ్ ఛేంజర్కు సైడ్ ఇవ్వండి

Game Changer Jaragandi: జరగండి..జరగండి..గేమ్ ఛేంజర్కు సైడ్ ఇవ్వండి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ (Game changer). తమిళ స్టార్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కు సంబందించిన అప్డేట్ త్వరలో రాబోతుందంటూ టాక్ వినిపిస్తోంది.జరగండి.. జరగండి.. అంటూ సాగే ఈ పాటను మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరగండి సాంగ్ వస్తోందంటూ సోషల్ మీడియాలో తెగ  ట్రెండ్ అవుతుంది. త్వరలో ఈ సాంగ్ అఫిసియల్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. 

గతేడాది దీపావళి కానుకగా జరగండి (Jaragandi) సాంగ్ వస్తోందని ప్రకటించి..మధ్యలోనే పోస్ట్ ఫోన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి కూడా పెరుగుతూ వచ్చింది.

అంతేకాకుండా..ఈ సాంగ్కి సంబంధించిన ట్యూన్, లిరిక్స్ లీక్ అవుతూ వచ్చాయి. దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. మళ్ళీ ఇన్నాళ్లకు జరగండి..జరగండి అంటూ వస్తోన్న గేమ్ ఛేంజర్కు సైడ్ ఇచ్చేద్దాం.ఇంకెన్నాళ్లని ఆపేస్తాం చెప్పండి.  ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న జరగండి  సాంగ్ కోసం ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. ఈ సాంగ్ కోసం డైరెక్టర్ శంకర్ రూ.15 నుంచి 20 కోట్లు వెచ్చించినట్లు సమాచారం.