గేమ్ చేంజర్ టీజర్ ట్రీట్‌‌కు రెడీ

గేమ్ చేంజర్ టీజర్ ట్రీట్‌‌కు రెడీ

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. కియారా అద్వానీ హీరోయిన్‌‌గా నటిస్తోంది. ఈ మూవీ రిలీజ్‌‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌‌ను ఒక్కో అప్‌‌డేట్‌‌తో ఖుషీ చేస్తున్నారు మేకర్స్.  ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‌ సినిమాపై అంచనాలు పెంచింది. శనివారం టీజర్‌‌‌‌ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ సందర్భంగా కియారా అద్వానీ కొత్త లుక్‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో మోడర్న్  లుక్‌‌లో ఆమె ఆకట్టుకుంటుంది.  దిల్ రాజు భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌‌లో ఎస్‌‌ జే సూర్య,  జ‌‌యరామ్‌‌, అంజ‌‌లి, సునీల్, శ్రీకాంత్‌‌, న‌‌వీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.