రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం అంత ఈజీ కాదు

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం అంత ఈజీ కాదు

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చురకలంటించారు. ఆయా రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకున్నప్పటికీ.. ఆట మాత్రం ఇంకా అయిపోలేదని అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు అంత సులభం కాదని దీదీ అభిప్రాయపడ్డారు. దేశంలోని మొత్తం చట్టసభ సభ్యుల్లో సగం మంది కూడా బీజేపీకిలేరన్న మమత.. గత రాష్ట్రపతి ఎన్నికల్లాగే ఈసారి బీజేపీ అభ్యర్థి విజయం అంత ఈజీ కాదని చెప్పారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ఓటమిపాలైనప్పటికీ గతంతో పోలిస్తే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీల చట్ట సభ్యుల సంఖ్య తక్కువేమీలేదని మమత చెప్పారు.

రాష్ట్రపతి ఎన్నికలు పరోక్ష విధానంలో జరుగుతాయి. పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ప్రెసిడెంట్ను ఎన్నుకుంటుంది. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్ల విలువను నిర్ణయిస్తారు. అప్పటి జనాభాను రాష్ట్ర ఎమ్మెల్యే సంఖ్యతో భాగించి సదరు ప్రజా ప్రతినిధి ఓటు విలువ లెక్కగడతారు. 

For more news..

ఢిల్లీలో బిజీబిజీగా యోగి ఆదిత్యనాథ్

మంత్రి హత్యకు కుట్ర కేసు నిందితుల రిమాండ్ పొడగింపు