55 ఏళ్ల కొడుకు..25 ఏళ్ల తండ్రి..గంధర్వ మూవీ ముచ్చట్లు..

55 ఏళ్ల కొడుకు..25 ఏళ్ల తండ్రి..గంధర్వ మూవీ ముచ్చట్లు..

వంగవీటి,జార్జ్ రెడ్డి ఫేం సందీప్ మాధవ్ హీరోగా నటించిన తాజా చిత్రం గంధర్వ. గాయత్రి అర్.సురేష్ హీరోయిన్గా నటించింది.  ఎస్. కె. ఫిలిమ్స్ బ్యానర్  సమర్పణలో గంధర్వ సినిమాను  సుభాని నిర్మించారు. ఈ మూవీతో అప్సర్ తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సెన్సార్ పూర్తి చేసుకున్న గంధర్వ మూవీ జూలై1న విడుద‌ల కాబోతుంది. ఈ సంద‌ర్భంగా  గంధ‌ర్వ సినిమా గురించి.. చిత్ర హీరో  సందీప్ మాధ‌వ్ మాటల్లో..

గంధర్వ కథ మీకెందుకు నచ్చింది..?
సంగీత దర్శకుడు షకీల్ ద్వారా గంధర్వ కథను అప్సర్ చెప్పారు. కథ విన్న వెంటనే బాగా నచ్చింది. ఈ మూవీలో ఒక పాత్రపై సినిమా నడుస్తుంది. సాధారణ సినిమాలోని అంశాలతో పాటు సరికొత్త పాయింట్ ఇందులో ఉంటుంది. నటుడిగా పర్ఫామెన్స్కు స్కోప్ ఉన్న కథ కావడంతో..ఈ సినిమా చెద్దామని అనుకున్నా.

మూవీలో మీ పాత్ర ఏంటి..?
గంధర్వ మూవీలో ఆర్మీ మ్యాన్గా నటించాను. పెళ్లయిన నెక్ట్స్ డేనే యుద్దానికి వెళ్లాల్సి వస్తే అతను ఏ నిర్ణయం తీసుకుంటాడనేది కథ. యుద్దానికి వెళ్లాక అతను కనిపించకుండా పోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇంట్రస్టింగ్ అంశం. 

గంధర్వ టైటిల్లో  1971-2021 ఉంది దానికి అర్థం ఏమిటి..?
గంధర్వ కథ..1971 లో మొదలవుతుంది..2021లో పూర్తవుతుంది. అందుకే సింబాలిక్గా అలా పెట్టాం. 

అసలు గంధర్వ అంటే ఏమిటి ?
పురాణంలో  కింపురుషులు, గంధర్వులు ఉంటారని తెలుసు. వారు నిత్య యవ్వనులు. మనిషి 50 ఏళ్ల తర్వాత  మార్పులకు గురవుతాడు. కానీ 50 ఏళ్లయినా..అతను యవ్వనంగా ఉంటే ఎలా ఉంటుంది..? ఇంటికి వచ్చాక భార్య, పిల్లలతో పాటు సమాజానికి ఎలా సర్దిచెప్పాడు అనేది ఈ సినిమా కథ. యుద్దం నుంచి వచ్చాక అతనికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మరి వాటిని ఎలా పరిష్కరించాడేది కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం.  సినిమాను చూస్తుంటే ఇంగ్లీష్ మూవీలా అనిపిస్తుంది. కానీ..కథలో విషయం ఉంటుంది..అది ప్రేక్షకుడికి నచ్చుతుందని అనుకుంటున్నాం. 

ఈ సినిమా ఆర్మీకి సంబంధించిన మూవీ అనుకుంటున్నారు...వారికేం చెప్తారు..?
ఇందులో పాత్ర మాత్రమే మిలటరీ పాత్ర. కానీ..మొత్తం సమాజం చుట్టూ తిరుగుతుంది..కథకు..మిలట్రీకి ఎటువంటి సంబంధం లేదు. 

మీరు అనుకున్నట్లు సినిమా వచ్చిందా ..?
మేం అనుకున్నదాని కంటే సినిమా బాగా వచ్చింది. ఈ మూవీలో సాయికుమార్, బాబూమోహన్, పోసాని కృష్ణమురళి, గాయత్రి సురేష్ వంటి మంచి నటీనటులున్నారు. సీనియర్ నటులుండటం సినిమాకు ప్లస్ అయిందని చెప్పాలి. 

 

దర్శకుడిగా అప్సర్ ఏ మేరకు సక్సెస్ అయ్యాడు. ఈ కథ మీరె ఫస్ట్ ఛాయిసా..?
అప్సర్కు దర్శకుడు కావాలనే తపన బాగా ఉంది. ఆయన ఆలోచన విధానం బాగా నచ్చింది. ఇక ఈ సినిమా తనే ఆర్మీ వ్యక్తిగా ఫీలయి కథను రాసుకున్నాడు. జవాన్ యుద్దానికి వెళ్తే ఆ కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంటుందో అప్సర్కు తెలుసు. అందుకే పర్ఫెక్ట్గా కథ రాశాడు. అలాగే తెరకెక్కించాడు. ఈ కథను నేనే ఫస్ట్ ఛాయిస్ అని అనుకుంటున్నా. 

గంధర్వలో ఫిక్షన్..రియలస్టిక్ ఏ మేరకు ఉంటుంది...
గంధర్వ స్టోరీకి మూలం ఫిక్షన్. అయితే ఇళ్లలో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయో కూడా ఆయన రాసుకున్నారు. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య  అప్యాయత , భార్య భర్తల ప్రేమ, తాత మనవడు మధ్య అనురాగాన్ని దర్శకుడు అప్సర్ బాగా తీశారు. ఇందులో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండవు. సినిమా చూస్తే..రియలస్టిక్గానే ఉంటుంది. 


యండమూరి నవలను సినిమా తీశారని వార్తలు వస్తున్నాయి..  
నాతో కూడా చాలా మంది అన్నారు. యండమూరి నవల సిగ్గు సిగ్గు నవలలా ఉందని. కానీ అది వేరు..ఇది వేరు. ఇందులో కొడుకు వయస్సు 55 అయితే..తండ్రి వయస్సు 25 ఏళ్లు.

గంధర్వ మూవీకి సంగీతం ఏ మేరకు ప్లస్ అవుతుంది..?
షకీల్ సంగీతం బావుంది. సందర్బానుసారం పాటలు ఇచ్చాడు. అతను అప్కమింగ్ సంగీథ దర్శకుడు. స్టోరీకి ఎలాంటి పాటలు ఇస్తే బాగుంటుందని దానిపై అతనికి మంచి అవగాహన ఉంది. 


ఫస్ట్ టైం మీరు కమర్షియల్ హీరోగా నటించారు. మరి మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు. 
గతంలో నేను చేసిన మూవీలు బయోపిక్ లు. ఆ పాత్రలు ఏలా చేయాలో అలానే చేశాను. వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాను లవర్ బాయ్ సినిమాలు వచ్చాయి. యాక్షన్ మూవీ కథలు వినిపించారు. వాటి కంటే భిన్నంగా ఉండాలని అనుకున్నా. అంతలోని ఈ స్టోరీ నాకు వినిపించారు. నచ్చడంతో ఓకే చెప్పేశాను . ఇందులో దర్శకుడి కోణంలో నటించే అవకాశం వచ్చింది. 1971లో నేను ఒకలా కనిపిస్తా...2021లో మ‌రోలా కనిపిస్తా. 

నిర్మాత‌ , ఎస్‌.కె. ఫిలిమ్స్ గురించి..
ప్రొడ్యూసర్ సుభానికి సినిమా అంటే ఇష్టం. అతను అప్సర్ సోదరుడు. స్టోరీ వినే టైంలో నిర్మాణ బాధ్యతల గురించి చర్చించుకున్నాం. నిర్మాతగా సుభాని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 

సెన్సార్ సభ్యుల స్పందన ఏంటి..
గంధర్వ సినిమా సెన్సార్ సభ్యులకు బాగా నచ్చింది. కొత్తపాయింట్ చెప్పారు..ఇది కొత్త జనరేషన్ చిత్రమని కితాబిచ్చారు. 

హీరోయిన్ ఎలా నటించింది..?
హీరోయిన్ గాయత్రి సురేష్ బాగా నటించింది. ఆమె మిస్ కేరళ. హవభావాలు కళ్లతో ఇస్తుంది. సినిమాలో క్లయిమాక్స్లో నన్నే డామినేట్ చేసిందనిపించింది.

 పూరీ జ‌గ‌న్నాథ్‌, ఆర్జీవీ దగ్గర వర్క్ చేశారు కదా..ఏం నేర్చుకున్నారు..?
ఇద్దరికి సినిమాయే ప్రపంచం. అందుకే వారు బెటర్ సినిమాలు చేస్తారు. పొద్దున నుంచి కష్టపడితే సాయంత్రం అలసిపోతాం. కానీ..వారి సాయంత్రం అయినా ఎనర్జిటిగ్ గానే ఉంటారు. యాక్టర్గా పూరీ నుంచి చాలా నేర్చుకున్నా. పెర్ఫామెన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్ ఎలా చెప్పాలనేది నేర్చుకున్నా. ఆర్టిస్ట్ లుక్ ఎలా ఉండాలి..పదిమందిలో ఎలా ప్రవర్తించాలనేది వర్మ నుంచి నేర్చుకున్నా.

గంధర్వ సినిమా ప్రేక్షకులకు ఎందుకు నచ్చుతుంది..?
ఇది కుటుంబ చిత్రం. అందరూ కలిసి చూసి ఆనందించే మూవీ. ఇలాంటి చిత్రాలు శ్రీకాంత్, జగపతిబాబు చేశారు. ఈ జనరేషన్కు నాకు అవకాశం వచ్చింది. ఈ రోజుల్లో యూత్ ను బేస్ చేసుకునే సినిమాలు వస్తున్నాయి. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గిపోయారు. కానీ ఇది ఫ్యామిలీ మూవీ. వారికి ఖచ్చితంగా నచ్చుతుంది.


మీ మూవీ కెరియర్ ఇంకా స్పీడ్ అందుకోలేదు కారణం...?
కరోనాకు ముందు మంచి సినిమాలు చేశాం. వంగవీటి, జార్జి్ రెడ్డి అవి మంచి పేరును తీసుకొచ్చాయి. అయితే కరోనా వల్ల గ్యాప్ తీసుకున్నా. ఆ తర్వాత స్టోరీలు సెట్ చేసుకోవడంలో గ్యాప్ వచ్చింది. అందుకే కొద్దిగా స్లో అయింది. ప్రస్తుతం ఫాస్ట్గా చేసేస్తున్నా.  అయితే ఏవి పడితే అవి చేయడం నాకిష్టం ఉండదు. నాకు సూటయ్యే కథల్లోనే నటిస్తా. 

మీరు ఏ తరహా కథలు ఇష్టపడతారు ..?
నాకు సైన్స్ ఫిక్షన్ మూవీలు, యాక్షన్ మూవీలంటే ఇష్టపడతాను. అలాగే కామెడీ మూవీలంటే కూడా ఇష్టమే. బయోపిక్లలో నటించేందుకు కూడా ఆసక్తి చూపిస్తా. 

మీ నెక్ట్స్ మూవీలేంటి..?
ప్రస్తుతం మాస్ మహరాజ్ అనే మూవీ చేస్తున్నా. ఇందులో రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు. అందులోనూ 50 ఏళ్ల పర్సన్గా నటిస్తున్నా. కోతల రాయుడు డైరెక్టర్ సుధీర్ రాజు ఈ సినిమాకు దర్శకుడు. ఇది కూడా కమర్షియల్ సినిమా.