ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్​లపై నిర్లక్ష్యం వద్దు : రాజారావు

ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్​లపై  నిర్లక్ష్యం వద్దు : రాజారావు
  •       వైరస్​ లక్షణాలుంటే ముందుగా ఐసోలేట్ ​కావాలి
  •      జీనోమ్​ సీక్వెన్సింగ్ పరీక్షలకు 59 శాంపిల్స్
  •      గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాజారావు

పద్మారావునగర్​, వెలుగు : కరోనా జేఎన్.1 ఒమిక్రాన్​ సబ్ ​వేరియంట్ వైరస్ ​విస్తరిస్తుండగా.. లక్షణాలున్నవారు వెంటనే ఆర్టీపీసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టులు చేయించుకొని ట్రీట్​మెంట్ పొందాలని కొవిడ్​ నోడల్​ కేంద్రం,  గాంధీ హాస్పిటల్​ సూపరింటెండెంట్​ ప్రొఫెసర్ రాజారావు సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్​ఫస్ట్​, సెకండ్​ సీజన్‌‌‌‌‌‌‌‌లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, వైరస్​నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారు ప్రస్తుతం కొంత శ్రద్ధ తగ్గి, సొంత వైద్యానికి ప్రయత్నిస్తున్నారన్నారు.  

ఇటీవల ఒక పేషెంట్ పాజిటివ్​అనుమానంతో గాంధీలో అడ్మిట్​కాగా పరీక్షలు చేస్తే నెగిటివ్​వచ్చిందన్నారు. ఇప్పటి వరకు జీనోమ్ సీక్వెన్సింగ్​కు 59 శాంపిల్స్​ను సీడీఎఫ్​డీ ( సెంటర్​ఫర్​డీఎన్​ఏ ఫింగర్​ప్రింట్​అండ్​డయాగ్నోస్టిక్స్​)కు పంపినట్లు తెలిపారు.  భవిష్యత్​లో  వైరస్​ బాగా ప్రబలితే,  పుణెలోని నేషనల్​ వైరాలజీ ల్యాబ్​అనుమతి ఇస్తే గాంధీలోని వైరాలజీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లోనే జీనోమ్‌‌‌‌‌‌‌‌ సీక్వెన్సింగ్ పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు. కోమార్డిస్​ పేషెంట్లు కిడ్నీ, లివర్, గుండె, టీబీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

మాస్క్​, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలన్నారు.  జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు ఉన్నవారు  వెంటనే  వైరస్​ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మేలన్నారు.  వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలన్నారు.  మన దగ్గర జేఎన్.1 ప్రభావం ఇంతవరకు ఏమీ లేదని, పాజిటివ్ ​రేట్​ కూడా బాగా తక్కువని తెలిపారు.  ప్రస్తుతం గాంధీలో పాజిటివ్ కేసులు లేవన్నారు. అయితే లేబర్​వార్డు, క్యాజువాలిటీ వెనక వైపు రెండు కొవిడ్​ ఐసోలేషన్​ వార్డులను అన్ని వైద్య వసతులతో  సిద్ధంగా ఉంచామన్నారు. 

నిలోఫర్​లో మరో  చిన్నారికి కరోనా

మెహిదీపట్నం :  నిలోఫర్ ఆస్పత్రిలో మరో  చిన్నారికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. మంగళవారం ఆస్పత్రిలో మొత్తం 17 మంది చిన్నారుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్​కు పంపినట్లు డాక్టర్లు తెలిపారు. బుధవారం రిజల్ట్స్ రాగా..  చౌటుప్పల్​కు చెందిన 9 నెలల చిన్నారికి  కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యిందన్నారు.  ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. నిలోఫర్​లో మూడ్రోజుల్లో మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నమోదైన కేసుతో కలిసి నిలోఫర్​లో మొత్తం 4 కరోనా పాజిటివ్ కేసులున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి పేర్కొన్నారు.