ఆర్మూర్, వెలుగు : గాంధీ జయంతిని పురస్కరించుని ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో నిరుపేదలకు బుధవారం భోజనం ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్దేవి లావణ్య హాజరై నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జర్నలిస్టుకాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కొక్కెర భూమన్న, ప్రధాన కార్యదర్శి కమలాకర్, సత్యనారాయణ గౌడ్, గడ్డం శంకర్, ఎల్ టి కుమార్, కొంతం రాజు, ఎర్ర భూమయ్య, మంచిర్యాల కిషన్, సతీశ్, రాజ్ కుమార్, జీవన్, గోపీ, సాయన్న, గణేష్, ఖదీర్, లతీఫ్, ముత్తెన్న, కొండి పవన్ తదితరులు పాల్గొన్నారు.