ఇస్రో పాదయాత్ర.. 26 రోజులు నడిచి శాస్త్రవేత్తలకు అభినందనలు

ఇస్రో పాదయాత్ర.. 26 రోజులు నడిచి శాస్త్రవేత్తలకు అభినందనలు

చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ప్రపంచవ్యాప్తంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కఠిన పరిస్థితులను దాటుకుని చంద్రయాన్-3 మిషన్‌ను సక్సెస్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించేందుకు ఎం కరుప్పయ్య అనే గాంధేయవాది తమిళనాడు నుంచి  బెంగళూరుకు 26 రోజుల పాదయాత్ర చేశారు.  

మధురైకి చెందిన  ఎం కరుప్పయ్య  సెప్టెంబర్ 21న తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలోని అలత్తూర్ నుంచి బెంగళూరుకు పాదయాత్ర ప్రారంభించాడు  500 కిలో మీటర్ల పాదయాత్ర ప్రయాణంలో  స్కూల్స్, కాలేజీల విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.  దేశభక్తి, గాంధేయ సూత్రాలు, పర్యావరణ పరిక్షణ తదితర అంశాల గురించి వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు  కరుప్పయ్య  దేశవ్యాప్తంగా పలు యాత్రలు చేశారు. 

చంద్రయాన్-3 మిషన్ విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవానికి చేరుకున్న తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించడానికి ఇప్పుడు తమిళనాడు నుంచి బెంగళూరుకు పాదయాత్ర చేశానని గాంధేయవాది కరుప్పయ్య తెలిపారు. ఇస్రో శాస్త్రవేతలు చంద్రయాన్ 3 మిషన్ ను విజయవంత చేయడానికి 24 గంటలు శ్రమించారన్నారు.  అందుకే వారిని వ్యక్తిగతంగా కలుసుకొని అభినందిచానన్నారు.   తన పాదయాత్ర తమిళనాడులోని కరూర్, నమక్కల్, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, హోసూర్ మీదుగా కర్నాటకలో ప్రవేశించి ఆదివారం (అక్టోబర్ 15)న బెంగళూరుకు చేరుకున్నారు. 

ఇస్రో శాస్త్రవేత్తలను సోమవారం ( అక్టోబర్ 16) కలిసి తన పాదయాత్రలో త్రివర్ణ పతాకంతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేశానని తెలిపారు.  తన పాదయాత్రకు డెమోక్రటిక్ అవేర్‌నెస్ మూవ్‌మెంట్ ఆర్గనైజేషన్  మద్దతు తెలిపిన వై.జి.నాగరాజ్, ఇస్రో శాస్త్రవేత్తలను కలవడానికి ఐదుగురు సభ్యుల బృందానికి సోమవారం ( అక్టోబర్ 16) అపాయింట్‌మెంట్  ఇచ్చారు. 

గాంధీ జీవితం గురించి  వివరించడానికి తిరుపూర్ టూ తుమకూరు, ఇండియా, పాకిస్తాన్ బోర్డర్  వరకు వాఘా యాత్ర,  ఈ రోడ్ టూ హైదరాబాద్  యాత్రలను పాదయాత్ర ద్వారా అంతేకాకుండా ఒక లక్ష కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేశారు.  గాంధీ దండి మార్చ్ 90 వ వార్షికోత్సవం సందర్భంగా తాను మరో యాత్రను చేయాలని నిర్ణయించుకున్నానని కరుప్పయ్య తెలిపారు.