
హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ ఇండియా గణేష్ చతుర్థి పండుగ కోసం ప్రత్యేక స్టోర్‌ను ప్రారంభించింది. మట్టి వినాయక విగ్రహాలు, హస్తకళల అలంకరణ వస్తువులు, పూజా సామగ్రి, పండుగ దుస్తులు, స్వీట్లను ఇక్కడ కొనుగోలు చేయవచ్చు.
పండుగ అలంకరణ వస్తువులపై 90 శాతం వరకు, పూజా సామగ్రిపై 80 శాతం వరకు, మట్టి వినాయక విగ్రహాలపై 80 శాతం వరకు తగ్గింపు ఉందని అమెజాన్ తెలిపింది. పండుగ దుస్తులు, నగలపై 80 శాతం, లడ్డూలు, డ్రై ఫ్రూట్స్ లాంటి మిఠాయిలపై 60 శాతం వరకు డిస్కౌంట్దక్కించుకోవచ్చని పేర్కొంది. అమెజాన్ కారిగర్ హస్తకళా వస్తువులపై 85 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని సంస్థ తెలిపింది.