18వ తేదీనే వినాయక చవితి, 28న నిమజ్జనం : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటన

18వ తేదీనే వినాయక చవితి, 28న నిమజ్జనం : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రకటన

వినాయకచవితి పండుగ, నిమజ్జనంపై క్లారిటీ వచ్చేసింది. 2023, సెప్టెంబర్ 18వ తేదీన జరుపుకోవాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు సెప్టెంబర్ 6వ తేదీన అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది తిధి రెండు రోజులు ఉండటం వల్ల.. పండుగ 18వ తేదీ జరుపుకోవాలా లేక 19వ తేదీ జరుపుకోవాలా అనే విషయంలో అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ సమావేశం అయ్యి.. పండుగ తేదీ, నిమజ్జనం తేదీని ప్రకటించింది. 

గణేష్ నిమజ్జనంను సెప్టెంబర్ 28వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది కమిటీ. ఆ రోజునే హైదరాబాద్ లో శోభాయాత్ర ఉంటుందని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రులు ముగిసిన తర్వాత 28వ తేదీ నిమజ్జనం చేసుకోవాలని సూచించింది కమిటీ.
 

ALSO READ : ఉదయనిధి కామెంట్స్​పై రాహుల్ గాంధీ స్పందించాలి: ప్రకాశ్ జావడేకర్​

శృంగేరి కంచి పీఠాధిపతుల పంచాంగం కూడా 18వ తేదీనే వినాయక చవితి జరుపుకోవాలని సూచించిందని.. అదే విధంగా పలువురు పండితుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించటం జరుగుతుందని వెల్లడించింది. ఇక ప్రభుత్వం కూడా 18వ తేదీనే వినాయక చవితి సెలవు, 28వ తేదీన నిమజ్జనం సెలవు ప్రకటించాలని సూచించింది.