హైదరాబాద్​లో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్​ రోడ్​షో

హైదరాబాద్​లో గణేష్ హౌసింగ్ కార్పొరేషన్​ రోడ్​షో

హైదరాబాద్​, వెలుగు: గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో గుజరాత్ ఐటీ/ఐటీఈఎస్ పాలసీ 2022–-27 మూడో  రోడ్‌‌‌‌‌‌‌‌షోను విజయవంతంగా నిర్వహించింది. గుజరాత్ ప్రభుత్వం  డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అసోచామ్‌‌‌‌‌‌‌‌తో కలిసి దీనిని ఏర్పాటు చేసింది.

 200కి పైగా ఐటీ,  ఐటీఈఎస్ కంపెనీల ప్రతినిధులు దీనిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ తన ఐటీ ప్రాజెక్ట్​ మిలియన్ మైండ్స్ టెక్ సిటీని హైదరాబాద్ టెక్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌కు పరిచయం చేసింది.  ఈ ప్రాజెక్ట్ గుజరాత్  సాంకేతిక రంగాన్ని విప్లవాత్మకంగా మారుస్తుందని తెలిపింది. గుజరాత్ ఐటీ పాలసీ కింద అందించే వివిధ ప్రోత్సాహకాలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.