
దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 6 వ తేదీన గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వినాయకుడి నిమజ్జనం రోజున నిర్వహించే పూజా కార్యక్రమాలు ఎంతో పవిత్రంగా ... ఆచార సంప్రదాయాలనుసారంగా జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు గణపతిని భక్తితో పూజించి .. చివరికి నిమజ్జనం చేస్తారు. ఈ పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో, ఏమి చేయాలో తెలుసుకుందాం. . .
ALSO READ : సెప్టెంబర్ నెలలో చంద్ర, సూర్య గ్రహణాలు..
- హిందూ మత విశ్వాసాల ప్రకారం భాద్రపద మాసంలోని అనంత చతుర్ధశి రోజున ( సెప్టెంబర్ 6 ) వినాయక విగ్రహాలను సమీపంలోని నదులు, చెరువు లేదా సముద్రాల్లో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జనానికి ముందు చేసే పూజ చేయాలి.
- సెప్టెంబర్ 6 వ తేది బ్రహ్మముహూర్త సమయానికి కాలకృత్యాలు తీర్చుకొని..పూజకు సిద్దం చేసుకోవాలి.
- వినాయక నిమజ్జనం చేసేందుకు పూజ చేయాలి.. హారతి ఇచ్చిన తరువాత ఉద్వాసన చెప్పి.. శ్రీ మహాగణపతయే నమ: యథాస్థానం ప్రవేశయామి అని ప్రార్థించాలి.
- రెండు చేతులతో నమస్కారం చేస్తూ స్వామి వారిని స్మరించుకోవాలి. అయిదు సార్లు లేదా తొమ్మిది సార్లు గుంజిళ్లు తీయాలి.
- నవరాత్రి ఉత్సవాల్లో తెలిసి, తెలియక చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలి
- వినాయకుడికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూ.. ఇతర పదార్థాలను భక్తులు అందరూ తీసుకోవాలి.
- దీపారాధన ఘనం అయిన తరువాత పత్రిలోని ఐదు ఆకులను తీసుకొని .. వాటికి పసుపు.. కుంకుమ.. గంధంతో అలంకరించి పసుపుదారంతో చేతికి కట్టుకోవాలి. .
- మళ్లీ చివరిగా హారతి ఇచ్చి ... భక్తులు విగ్రహాన్ని తీసుకెళ్లాలి.
- గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత, వారు మళ్లీ అగరబత్తులు వెలిగించి, పువ్వులు, స్వీట్లు సమర్పించి, కొబ్బరికాయలు పగులగొట్టి హారతి ఇవ్వాలి.
- గణపతి బప్పా మోరియా..జై బోలో గణేష్ మహారాజ్ అనే నినాదాలు చేయాలి. అనంతరం నిమజ్జన ఊరేగింపు నిర్వహిస్తూ స్వామివారిని తరలించాలి.
- గణేశ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసి, వచ్చే ఏడాది మళ్లీ రావాలని ప్రార్థించాలి.