GOG first day collections: విశ్వక్ మాస్ జాతర.. అదిరిపోయిన ఫస్ట్ డే కలెక్షన్స్

GOG first day collections: విశ్వక్ మాస్ జాతర.. అదిరిపోయిన ఫస్ట్ డే కలెక్షన్స్

మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్(Vishwek sen), టిల్లు బ్యూటీ నేహశెట్టి (Neha Shetty) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ అఫ్ గోదావరి. రూరల్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో నటి అంజలి (Anjali) కీ రోల్ చేశారు. కృష్ణ చైతన్య తెరకెక్కించిన ఈ విలేజ్ మాస్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసినా ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

మొదటి షో నుండే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక సినిమాలో విశ్వక్ మాస్ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. కథపై కొంచం అటూ ఇటూగా ఉందని కామెంట్స్ వినిపించినప్పటికీ.. విశ్వక్ నటన పీక్స్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో.. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబట్టింది ఈ సినిమా. 

తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. అధికారిక లెక్కల ప్రకారం ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.8.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందట. విశ్వక్ సేన్ కెరీర్ లో ఇదే సెకండ్ హైయెస్ట్ అవడం విశేషం. సినిమాకుక్ పాజిటీవ్ టాక్ రావడం, రానున్న రెండు రోజులు కూడా సెలవుదినాలు కాబట్టి.. ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమా ఈజీగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచే అవకాశం క్లియర్ గా కనిపిస్తోదని టాక్.