గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్

గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్

గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అలియాస్ రామచంద్రుడిని  హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2016లో నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీలోని కర్నూల్ లో సెటిల్ మెంట్లు చేస్తున్నాడు. హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ కొత్తపేటలోని ఓ హోటల్ లో సెటిల్మెంట్ చేస్తుండగా శేషన్నను పోలీసులు  పట్టుకున్నారు . కాసేపట్లో  అతన్ని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. 

మహబూబ్ నగర్ జిల్లాకు శేషన్నకు మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత నయీంతో పరిచయం ఏర్పడింది. మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి సొంత గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నారు. కబ్జాలు, కిడ్నాప్ లు, బెదిరింపులు, వసూళ్లు చేసేవారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి శేషన్న కోసం పోలీసులు గాలిస్తున్నారు.