
వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. సయీ మంజ్రేకర్ హీరోయిన్. సునీల్ శెట్టి, ఉపేంద్ర, జగపతిబాబు, నవీన్ చంద్ర ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మిస్తున్న ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ని నిన్న అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్‌గా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు కన్‌ఫర్మ్ చేశారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో రియాక్టయిన వరుణ్ తేజ్.. ‘మూడు సంవత్సరాల మా రక్తం, చెమట ఈ చిత్రం. చివరకు మీ గౌరవాన్ని పొందే సమయం వచ్చింది’ అంటూ ట్వీట్ చేశాడు. లాస్ట్ ఇయర్ దీపావళికి రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్‌గా మహాశివ రాత్రికి రాబోతోంది. ఫస్ట్ టైమ్ వరుణ్ నటిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ కావడంతో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే లుక్, సాంగ్స్‌తో మెస్మరైజ్ చేశాడు. మరోవైపు వెంకటేష్‌తో కలిసి వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఎఫ్ 3’ మే 27న విడుదల కానుంది.