స్కూల్స్ దగ్గర పిల్లలకు గంజాయి చాక్లెట్లు ..తల్లిదండ్రుల్లారా ఒక్కసారి గమనించండి

స్కూల్స్ దగ్గర పిల్లలకు గంజాయి చాక్లెట్లు ..తల్లిదండ్రుల్లారా ఒక్కసారి గమనించండి

స్కూళ్లకు వెళ్తున్న పిల్లలకు డబ్బులిస్తున్నారా...ఆ డబ్బులతో మీ పిల్లలు స్కూళ్ల దగ్గర ఉన్న దుకాణాల్లో చాక్లెట్లు కొనుక్కుంటున్నారా.. అయితే  ఆ చాక్లెట్లలో ఏముంటుందో తెలిస్తే  మీరు షాక్ అవుతారు. స్కూళ్ల దగ్గర అమ్మే చాక్లెట్లలో గంజాయి ఉంటుందట. ఏంటీ గంజాయా..అని అనుకుంటున్నారా..అవును..ఇది నిజం..వివరాల్లోకి వెళ్తే..

గంజాయి కలిపిన చాక్లెట్ల విక్రయం..

స్కూళ్ల దగ్గర ఉన్న దుకాణాల్లో పిల్లలకు గంజాయి కలిపిన చాక్లెట్లను అమ్ముతున్నట్లు పోలీసులు తేల్చారు. ఇద్దరు నిందితులు ఈ చాక్లెట్లను విడి విడిగా చిన్నారులకు విక్రయిస్తున్నారని కనుగొన్నారు. గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోహర్ షెట్, బచిన్ సోంకర్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరు స్కూళ్ల దగ్గర చిన్నారులకు చాక్లెట్లు అమ్ముతున్నట్లు తేల్చారు. అయితే ఈ చాక్లెట్లు తింటున్న విద్యార్థులు వింత వింతగా ప్రవర్తిస్తున్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఒక కిలో గంజాయి కలిపిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం మంగుళూరులో చోటు చేసుకుంది. 

అవే కావాలంటూ మారాం చేస్తున్నరు..

గంజాయి చాక్లెట్లకు అలవాటు అయిన పిల్లలు..పదే పదే అవే చాక్లెట్లు కావాలని మారాం చేస్తున్నారట. వేరే చాక్లెట్లు కొనిస్తే అస్సలు తీసుకోవడం లేదట. రూ. 20 రూపాయల చాక్లెట్లే కావాలని పట్టుబడుతున్నారట. పిల్లల ఇష్టాన్ని కాదనలేక చాక్లెట్లు కొనిస్తే..అవి తిన్నాక వారు వింత వింతగా ప్రవర్తిస్తుననట్లు గమనించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇటీవలే కర్ణాటకలోని రాయచూరులో పోలీసులు గంజాయి కలిపిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 4వ తేదీన గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 700 గంజాయి కలిపిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు ఈ చాక్లెట్లను స్కూళ్లకు పరిసరాల్లోని దుకాణాలు, ఇతర షాపులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. మురికివాడలు, లేబర్ కాలనీలను లక్ష్యంగా చేసుకుని చాక్లెట్లను అమ్ముతున్నారని చెప్పారు.