కోణార్క్ ఎక్స్ప్రెస్ లో గంజాయి పట్టివేత..‌‌‌మహారాష్ట్ర, యూపీకి చెందిన నలుగురు అరెస్ట్

కోణార్క్ ఎక్స్ప్రెస్ లో  గంజాయి పట్టివేత..‌‌‌మహారాష్ట్ర, యూపీకి చెందిన నలుగురు అరెస్ట్
  • ‌‌‌‌బ్యాగుల్లోని 8.7 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
  • ‌‌‌‌వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

కాశీబుగ్గ, వెలుగు: కోణార్క్ ఎక్స్​ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్న నలుగురిని ఆర్పీఎఫ్, డ్రగ్ కంట్రోల్ టీమ్ అదుపులోకి తీసుకొని గంజాయి స్వాధీనం చేసుకుంది. వరంగల్ రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్​ సీఐ శ్రీనివాస్​గౌడ్​తెలిపిన ప్రకారం.. బుధవారం  కోణార్క్ ఎక్స్​ప్రెస్ (ట్రైన్ నం. 11020 ) భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తుండగా.. డ్రగ్ కంట్రోల్ టీమ్ సీఐ సతీశ్, ఎస్ఐ పూర్ణచందర్, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రలోని  డైసర్ కు చెందిన కూలీ ఎండీ అశ్రఫ్ షేక్ (40), డోంగ్రి శాంతినగర్ కు చెందిన రహీం బాబన్ పటేల్(30), యూపీలోని ప్రయాగ్ రాజ్ జిల్లాకు చెందిన రాజు ఠాకూర్ (24), మహారాష్ట్రలోని రత్నగిరి దైసార్ కు చెందిన ప్రవీణ్ శ్యామ్ తవుడే(39) రైలులో అనుమానాస్పదంగా కనిపించారు.

వీరి వద్ద బ్యాగులను తనిఖీ చేయగా 8.7 కిలోల ఎండు గంజాయి దొరికింది.  వెంటనే  నిందితులను అదుపులోకి తీసుకొని ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. నిందితుల వివరాలను సేకరించి డ్రగ్ కంట్రోల్ టీమ్ కు అప్పగించారు. రైళ్లల్లో,  రైల్వే స్టేషన్లలో అనుమానిత వ్యక్తులు కనిపించినా, మాదకద్రవ్యాల రవాణా చేస్తున్నట్లు తెలిసినా వెంటనే రైల్వే అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు సూచించారు.