పాల్వంచలో భారీగా గంజాయి పట్టివేత

పాల్వంచలో భారీగా గంజాయి పట్టివేత

పాల్వంచ, వెలుగు : ఒడిశా జిల్లాలోని మల్కాన్ గిరి నుంచి హైదరాబాద్ కు కారులో గంజాయిని తరలిస్తుండగా స్థానిక పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..  గంజాయి తరలిస్తున్నట్లు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ స్పైడర్ అధికారులకు వచ్చినా పక్కా సమాచారంతో పాల్వంచలో వెహికల్స్​ను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా ఉన్న ఓ కారును ఆపి తనిఖీ చేయగా రూ.20 లక్షల విలువైన గంజాయి పట్టుబడింది. ఈ దాడుల్లో మహారాష్ట్రకు చెందిన నగేశ్, రాజస్థాన్ కు చెందిన రాజు

ఖమ్మం జిల్లా కొనిజర్ల సమీపంలోని రాజస్థాన్ దాబాకు చెందిన అహ్మద్ రాజాను అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకొని నిందితులను రిమాం డ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల్లో ఎన్ ఫోర్స్ మెంట్ ఏఈఎస్ తిరుపతి, సీఐ సర్వేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ కరీం, కానిస్టేబుళ్లు బాలు, సుధీర్, హరీశ్, వెంకట్, హనుమంతరావు, విజయ్ పాల్గొన్నారు.