
మెహిదీపట్నం, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌చేసినట్లు ధూల్‌పేట్ ఎక్సైజ్‌పోలీసులు తెలిపారు. ధూల్‌పేట్, కార్వాన్ రోడ్డులో గురువారం గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అమర్ సింగ్ ధనుంజయను పట్టుకొని, రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్‌చేసి, రిమాండ్‌కు పంపామన్నారు. తుల్జా సింగ్, కిషన్, వంశీ, సోను, సుభాయ్ పరారీలో ఉన్నట్లు ఎస్టీఎఫ్ లీడర్ అంజిరెడ్డి పేర్కొన్నారు.