ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెత్త అన్ లోడింగ్కూ తిప్పలే..

ఖమ్మం మున్సిపల్  కార్పొరేషన్  పరిధిలోని చెత్త అన్ లోడింగ్కూ తిప్పలే..

ఖమ్మం మున్సిపల్  కార్పొరేషన్  పరిధిలోని డంపింగ్  యార్డ్ లో అన్​లోడింగ్​కు తిప్పలు పడాల్సి వస్తోంది. నగరంలోని 60 డివిజన్లలో చెత్తను సేకరించి డంపింగ్  యార్డ్ లో అన్​లోడింగ్​ వెళ్తే, వెహికల్  తిరిగి వచ్చేందుకు సాయంత్రం అవుతోంది. 

డంపింగ్ యార్డ్ లో చెత్తను పక్కకు తొలగించే మెషీన్​ ఒక్కటే ఉండడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందని వెహికల్  డ్రైవర్లు వాపోతున్నారు. రెండు జేసీబీలు మూలనపడగా, వాహనాలు లైన్​లో ఉంచిన డ్రైవర్లు నిల్చోవడానికి నీడ లేక, తాగడానికి నీళ్లు లేక తిప్పలు పడుతున్నారు.

–వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం