గరిమెళ్లపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత

గరిమెళ్లపాడులో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో నమోదవుతున్నాయి. చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో మంగళవారం 44.2డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండుతున్న ఎండలతో మధ్యాహ్నం టైంలో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు.

అశ్వాపురంలో 43.8డిగ్రీలు, కొత్తగూడెంలో 43.6, లక్ష్మీదేవిపల్లిలో 43.4, పాల్వంచ మండలం సీతారామపట్నంలో 43.2, భద్రాచలంలో 43, జూలూరుపాడులో 42.9, మణుగూరు, దుమ్ముగూడెంలలో 42.5, పాల్వంచ మండలం యానంబైలులో 42.1, పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, చర్ల మండలం సత్యనారాయణపురంలలో 41.9,ఆళ్లపల్లిలో 41.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.