గరిమెళ్ల పాడులో 42.7డిగ్రీల ఉష్ణోగ్రత

గరిమెళ్ల పాడులో 42.7డిగ్రీల ఉష్ణోగ్రత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈనెల మొదటి వారంలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సుజాతనగర్​లో 42.6, లక్ష్మీదేవిపల్లిలో 42.4, పాత కొత్తగూడెంలో 42.3, అశ్వాపురంలో 42, భద్రాచలంలో 41.6, పాల్వంచ మండలంలోని సీతారాం పట్నంలో 41.2, యానంబైలులో 41.1, ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటికి వచ్చేందుకు జంకుతున్నారు.