కిలో వెల్లుల్లి రూ. 500 పైనే..ధర పెరగడంతో చేన్లలో చోరీలు

కిలో వెల్లుల్లి రూ. 500 పైనే..ధర పెరగడంతో చేన్లలో చోరీలు
  • కాపాడుకొనేందకు సీసీ కెమెరాలు

భోపాల్ :  మార్కెట్ లో ఇప్పుడు వెల్లుల్లికి భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం నాణ్యమైన కిలో వెల్లుల్లి ధర రూ.500 పలుకుతోంది. ధర పెరగడంతో వెల్లుల్లి పంట చోరీకి గురవుతోంది.  మధ్యప్రదేశ్ లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్‌ ప్రాంత రైతులు దొంగతనాలు అరికట్టేందుకు పంట పొలాల్లో రైతులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటున్నారు. ఎల్లిగడ్డ చేన్లను సీసీ కెమెరాల్లో పర్యవేక్షిస్తున్నారు. వీటి ఏర్పాటుతో దొంగతనాలు ఆగిపోయాయని రైతులు చెబుతున్నారు. ఈ కెమెరాలు సౌరశక్తితో పనిచేస్తాయని.. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే అలారం సౌండ్ చేస్తాయని అంటున్నారు.