వంట గ్యాస్ ధరలు మరోసారి పెంచడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. మూడు నెలల్లో రెండుసార్లు డొమెస్టిక్ గ్యాస్ ధరలు పెంచడంతో సామాన్యప్రజలపై మరింత భారం పడుతోందన్నారు. ఆదివారం (జూన్ 7) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు వివరాల్లోకి వెళితే..
మెదక్ జిల్లాలో..
హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై కట్టెల పొయ్యి పెట్టి , గ్యాస్ మొద్దులను ఎత్తుకొని , వంట చేస్తూ మహిళలు నిరసన తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే మూడు సార్లు గ్యాస్ ధరలు పెంచడం సామన్యులకు పెనుభారం అవుతుందని , ప్రధాని మోదీ రాజీనామా చేయాలని, డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పెంచిన ధరలు తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
వంటగ్యాస్ ధరలు పెంచడంతో వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం మండిపడ్డారు. మూడు నెలల్లో రెండు సార్లు గ్యాస్ ధరలు పెంచడంతో పేద, మధ్యతరగితి ప్రజలను తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ రేట్లు పెంచడంతో ఇప్పటికే అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి. ఇప్పుడు గ్యాస్ ధర పెంచడంతో ఏం వండుకుని తినాలన్నా భారంగా మారిందన్నారు. పెరిగిన సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
