
ఈ రోజుల్లో బీపీ-బ్లడ్ ప్లెజర్ అనేది కామన్ అయిపోయింది. చాలా మందిలో హైబీపీ లేదా లో బీపీ ఉండటం కామన్ లే.. అనుకునేలా మారిపోయింది పరిస్థితి. కానీ దాని ఫలితాలు మాత్రం కొన్నిసార్లు దారుంగా ఉంటున్నాయి. అందులో హైబీపీ అయితే మెల్లమెల్లగా ఘోరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తుంటుంది. సాధారణంగా బీజీ 120/80 కంటే ఎక్కువగా ఉందంటే కాంప్లికేషన్స్ రాకముందే యాక్షన్ తీసుకోవాలంటున్నారు వైద్యులు.
ప్రముఖ గ్యా్స్ట్రో ఎంటరాలజిస్ట్ డా.పాల్ మాణిక్యం హై బీపీ గురించి చాలా మందికి తెలియని నిజాలు బయటపెట్టారు. అందరూ సాల్ట్ (ఉప్పు), స్ట్రెస్ (ఒత్తిడి) కారణంగానే హైబీపీ వస్తుంటుందని నమ్ముతుంటారు. కానీ అసలు కారణం వేరే ఉందని చెబెతున్నారాయన. హైబీపీకి సాల్ట్ ఒక్కటే విలన్ కాదని.. దానికి గల కారణాలను ఇన్స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. హైబీపీకి గల కారణం గురించి అంచనా కూడా వేయలేరని అన్నారు.
హైబీపీకి ఉప్పు, ఒత్తిడి తో పాటు మరో కారణం ఉందని చెప్పారు డా.మాణిక్యం. హైబీపీ అంటే రక్త నాళాలు చాలా గట్టిగా.. మందంగా ఉండటం వలన.. గుండె, మెదడు, కిడ్నీలకు వెళ్లే రక్త సరఫరా వేగాన్ని రక్త నాళాలు గట్టిగా, మందంగా ఉండటం వలన మెల్లగా అడ్డుకుంటుంటాయని.. దీని కారణంగా అవయవాలు డ్యామేజ్ కావటం.. గుండె పోటు, కిడ్నీ ఫెయిల్ కావడం వంటి సమస్యలు వస్తుంటాయని తెలిపారు. దీనికి అసలైన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్పారు.
మనం తీసుకునే ఆహారం నుంచి షుగర్ ను కంట్రోల్ చేసే హార్మోనే ఇన్సులిన్. అయితే ఎక్కువగా తినటం.. లేట్ గా తినటం వలన ఇన్సులిన్ పనితీరు మారిపోతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. అంటే ఇన్సులిన్ ను సరిగ్గా పనిచేయకుండా ఆపటం. దీంతో బీపీ పెరిగి పోవడం జరుగుతుంది. కానీ చాలా మంది చెట్నీలు తినటం, ఉప్పు ఎక్కువగా తినటమేనని భావిస్తుంటారు. అసలు కారణం.. లేట్ గా అంటే.. ఉదయం 11 గంటలకు తినటం.. ఒకేసారి ఎక్కువగా తినటం అని చెబుతున్నారు.
ఇన్సులిన్ పనిచేయక పోతే ఏమవుతుంది..?
ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే షుగర్ ఫ్యాట్ లాగా మారిపోతుంది. అంటే కొవ్వులాగా మారుతుంది. ఈ కొవ్వు కారణంగా రక్తనాళాలు ఉబ్బటం.. డ్యామేజ్ కావటం.. జరుగుతుంటుంది. దీనికారణంగా మెల్లమెల్లగా బీపీ పెరిగిపోతుంది. బీపీ 120/80 కంటే ఎక్కువగా ఉందంటే.. అది వేకప్ కాల్ కింద తీసుకోవాలని చెబుతున్నారు. అది తీవ్రం కాకముందే చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రెగ్యులర్ గా బీపీ చెకప్ చేసుకోవాలని.. 18 ఏళ్లు దాటినవాళ్లు కనీసం రెండేళ్లకోసారైనా చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.