బుక్ ఫెయిర్ ప్రాంగణానికి గద్దర్ పేరు

బుక్ ఫెయిర్ ప్రాంగణానికి గద్దర్ పేరు

హైదరాబాద్: రేపటి నుంచి ఈ నెల 19 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో 36వ నేషనల్ బుక్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు.

శని, అది వారాల్లో మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 9 వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ సారి బుక్ ఫెయిర్ ప్రాంగణానికి గద్దర్ పేరు పెడుతున్నట్లు గౌరీ శంకర్ తెలిపారు. మొత్తం 364 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రేపు సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుక్ ఫెయిర్ ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి బాల వికాస్ పేరుతో పిల్లలచే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని గౌరీ శంకర్ వివరించారు. బుక్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన వేదికల పైన రోజూ సాయంత్రం 6 గంటలకు పలువురి రచయితల పుస్తకాల అవిష్కరణ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.

పిల్లలకు, జర్నలిస్టులకు, ఉపాధ్యాయులకు ఫ్రీ ఎంట్రీ అని.. సాధారణ ప్రజలకు 10 రూపాయిలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బుక్ ఫెయిర్ కు అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని గౌరీ శంకర్ అన్నారు.