సంపాదనలో  అదానీ జె​ట్​ స్పీడ్​ 

సంపాదనలో  అదానీ జె​ట్​ స్పీడ్​ 
  • ఎలన్‌ మస్క్‌, జెఫ్‌ బెజోస్‌, వారెన్‌ బఫెట్, బిల్​ గేట్స్‌ అందరినీ దాటిన గౌతమ్ అదానీ
  • 3 నెలల్లోనే  అదానీ సంపద 21 బిలియన్ డాలర్లు పైకి

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోర్టులు, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎంసీజీ, గ్యాస్‌‌‌‌‌‌‌‌ ఇలా అనేక సెక్టార్లలో బిజినెస్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్‌‌‌‌‌‌‌‌ అదానీ, ప్రపంచలోని మహా ధనవంతుల కంటే వేగంగా సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ఆయన సంపాదన ఎలన్‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌‌‌‌‌, బిల్‌‌‌‌‌‌‌‌ గేట్స్‌‌‌‌‌‌‌‌, వారెన్‌‌‌‌‌‌‌‌ బఫెట్‌‌‌‌‌‌‌‌, జెఫ్ బెజోస్ వంటి మహా మహుల సంపాదనను దాటేసింది. ఈ మూడు నెలల్లోనే గౌతమ్ అదానీ సంపద ఏకంగా 21.1 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం.  ఏ బిలియనీర్ కూడా అదానీ అంత వేగంగా తమ సంపదను పెంచుకోలేకపోయారు. బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం,  ఈ ఏడాది జనవరి– మార్చి పీరియడ్‌‌‌‌‌‌‌‌లో వారెన్ బఫెట్ సంపద 18 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ ఏడాది ఎక్కువగా సంపాదించిన వారిలో ఆయన రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు.  ముకేశ్‌‌‌‌‌‌‌‌ అంబానీ ఈ ఏడాది తన సంపదను 8.24 బిలియన్ డాలర్లు పెంచుకోగలిగారు. దేశంలోని అత్యంత సంపన్నుల్లో  అంబానీ టాప్‌‌‌‌‌‌‌‌లో ఉంటూ వస్తున్నారు.  అదానీ అంబానీకి బాగా చేరువయ్యారు. ఈ ఏడాదిలో గౌతమ్ అదానీ సంపద 27 శాతం పెరిగింది.

ఆసియాలో అత్యంత ధనంతులుగా..
బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్  బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ సంపద 97.6 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లుగా ఉంది.  ముకేశ్ అంబానీ సంపద 98.2 బిలియన్ డాలర్లు.   మొదటి ప్లేస్‌‌‌‌‌‌‌‌లో టెస్లా బాస్ ఎలన్ మస్క్‌‌‌‌‌‌‌‌(271 బిలియన్ డాలర్లు) , అమెజాన్ ఫౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జెఫ్‌‌‌‌‌‌‌‌ బెజోస్‌‌‌‌‌‌‌‌ (188 బిలియన్ డాలర్లు), లూయిస్‌‌‌‌‌‌‌‌విటన్ సీఈఓ బెర్నాల్డ్‌‌‌‌‌‌‌‌ ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌ (149 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు) లు  టాప్‌‌‌‌‌‌‌‌ మూడు పొజిషన్లలో ఉన్నారు. ముకేశ్ అంబానీ పదో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో, గౌతమ్ అదానీ 11 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో  ఉన్నారు.  టాప్‌‌‌‌‌‌‌‌ 10 మంది సంపన్నుల్లో 8 మంది యూఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన వారే! ఆసియాలోని అత్యంత సంపన్నుల లిస్టులో ముకేశ్‌‌‌‌‌‌‌‌ అంబానీ మొదటి ప్లేస్‌‌‌‌‌‌‌‌లో, గౌతమ్ అదానీ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచారు.   అజీమ్‌‌‌‌‌‌‌‌ ప్రేమ్‌‌‌‌‌‌‌‌జీ (34.4 బిలియన్ డాలర్లు) 36 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో, శివ్‌‌‌‌‌‌‌‌ నాడార్‌‌‌‌‌‌‌‌ (28.9 బిలియన్ డాలర్లు) 46 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో, రాధాకిషన్‌‌‌‌‌‌‌‌ దమానీ (20.7 బిలియన్‌‌‌‌‌‌‌‌ డాలర్లు) 75 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో, లక్ష్మీ మిట్టల్‌‌‌‌‌‌‌‌ (20.2 బిలియన్ డాలర్లు) 78 ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. ‌‌‌‌‌‌‌‌